Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెనజీర్ భుట్టోను చంపింది వారేనట...

మంగళవారం, 16 జనవరి 2018 (09:05 IST)

Widgets Magazine
benazir bhutto

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఎవరు చంపారన్న విషయంపై ఓ స్పష్టత వచ్చింది. తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ‘ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో బెనజీర్ హత్యకు సంబంధించి ఆసక్తికర విషయాలు రాశారు. ఆమెను చంపింది తెహ్రిక్ తాలిబన్ అనే ఉగ్ర సంస్థ అని పుస్తకంలో పేర్కొన్నారు. గతేడాది నవంబరు 30న ఈ పుస్తకాన్ని ప్రచురించగా తాజాగా ఆదివారం దీనిని విడుదల చేశారు. తాలిబన్ నేతలు చేసిన పలు అకృత్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
 
మాజీ ప్రధాని భుట్టోను బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు హత్య చేసినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. తొలుత బిలాల్ మాజీ ప్రధాని మెడపై కాల్చి ఆ వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఇక్రముల్లా తప్పించుకున్నట్టు పుస్తకంలో వివరించారు. దీంతో ఇన్నాళ్లకు భుట్టో హత్యపై స్పష్టత వచ్చింది.
 
నిజానికి భుట్టోపై హత్యాయత్నం జరగబోతోందంటూ నిఘా వర్గాలు పాక్ హోంశాఖను ముందే హెచ్చరించాయి. భుట్టో, ముషారఫ్, జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లర్ రహహాన్‌ను చంపేందుకు లాడెన్ అనుచరులు ప్లాన్ చేస్తున్నట్టు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
వీరి హత్యను పర్యవేక్షించేందుకు లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లినట్టు పేర్కొన్నాయి. లాడెన్ పేరుతో కొరియర్‌లో పేలుడు పదార్థాలు వచ్చాయని అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలను అప్పటి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఫలితంగా జరిగిన బాంబుదాడిలో భుట్టో మరణించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కమల్ హాసన్ రెడీ.. 26 నుంచి రాష్ట్ర పర్యటన.. ప్రజా సమస్యల కోసం..

రాజకీయాల్లో రావడం ఖాయమని చెప్పేసిన విలక్షణ నటుడు కమలహాసన్.. పార్టీ పేరును ప్రకటించక ముందే ...

news

కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ఆపాలి- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. ...

news

పందెంకోడి.. ఓడిపోతే.. చికెన్ పకోడీ.. లాగించేస్తున్న పందెంరాయుళ్లు

సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ...

news

సంక్రాంతి: అశ్లీల నృత్యాలుగా అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ...

Widgets Magazine