గాలిలో ఎగిరే పిజ్జాలను మీరెప్పుడైనా చూశారా?

సోమవారం, 4 డిశెంబరు 2017 (12:29 IST)

వ్యోమగాములు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటారు. అయితే జంక్ ఫుడ్స్ వారు తీసుకోరు. ఈ నేపథ్యంలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో నివ‌సించే వ్యోమగాములకు పిజ్జా తినిపించాలనిపించిందట. ఇప్పటికే డీహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడంతో వారి నాలుక చచ్చుపడిపోగా, కొత్త రుచుల కోసం వ్యోమగాములు వెంపర్లాడుతున్నారట. ఈ క్రమంలో అక్కడే వున్న ఓ ఇటాలియ‌న్ వ్యోమ‌గామి పావులో నెస్పోలీ ఎక్కువ‌గా పిజ్జా గురించి త‌న ట్వీట్ల‌లో ప్ర‌స్తావించారు. 
 
తనకు పిజ్జా తినాలనుందని.. మేఘాలను చూస్తే తనకు పిజ్జా గుర్తుకొస్తున్నట్లు ట్వీట్స్ చేశారు. దీన్ని చూసిన నాసా వారికి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇటీవ‌ల వెళ్లిన ఆహారం స‌ర‌ఫ‌రాలో భాగంగా వారికి పిజ్జా తయారు చేసుకునే ప‌దార్థాల‌ను పంపింది. ఇంకేంముంది.. వ్యోమగాముల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే వారు పిజ్జా తయారు చేసుకుని.. గాలిలో ఎగురుతున్న పిజ్జాలను తింటూ ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి. దీనిపై మరింత చదవండి :  
Astronauts Pizza Space Station Paolo Nespoli‏

Loading comments ...

తెలుగు వార్తలు

news

మానవత్వం మరిచిపోయారు.. గర్భిణీపై అత్యాచారయత్నం

ఇటీవలికాలంలో తెలంగాణా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, ...

news

'అల్లా' అన్నా ఆరేళ్ల విద్యార్థి... ఉగ్రవాదిగా ముద్రవేసిన టీచర్

అమెరికాలోని టెక్సాస్, పియర్లాండ్‌లో ఓ ఆరేళ్ళ విద్యార్థి అల్లా అంటూ బిగ్గరగా అరిచాడు. ...

news

#NavyDay : విశాఖ తీరంలో స్వర్ణోత్సవ సంబరాలు

నేవీ డేను పురస్కరించుకుని తూర్పు తీర నౌకాదళం స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. ...

news

శోభన్‌బాబుతో సహజీవనం నిజమే.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జయ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత -శోభన్ బాబుల సహజీవనం మళ్లీ తెరమీదకు వచ్చింది. జయలలిత కుమారి ...