ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (09:51 IST)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్... ఇంటి ఐసోలేషన్‌లో చికిత్స

Joe biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించింది. జో బైడెన్ దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆయన డెలావేర్‌ సముద్రతీరంలో ఉన్న తన ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్లో తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రచారంలో ఉన్న బైడెన్‌‍కు కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తారని వైట్ హౌస్ తెలిపింది. స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరీక్షలు నిర్వహించటంతో పాజిటివ్‌గా తేలినట్లు వివరించింది. 
 
ఆయనకు పాక్స్ విడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపింది. యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న ఆయన అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించి లేకపోవడం గమనార్హం. ఆయనతో ఉన్న విలేకరులతో తాను బాగానే ఉన్నట్లు వెల్లడించారు.
 
బైడెన్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.