Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మనుషుల గుండెల్ని కాల్చుకుతినే కిరాతకుడు, నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా అరెస్ట్

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:12 IST)

Widgets Magazine

మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా‌ అరెస్టయ్యాడు. మనుష్యులను దారుణంగా హత్యలు చేసి.. వారి గుండెలను పెకిలించి.. కాల్చుకుతినే జంగిల్ జబ్బా అలియాస్ మొహమ్మద్ జబ్బతెహ్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని హత్య చేసి అమెరికా పారిపోయిన జంగిల్ జబ్బా చిక్కాడు. అతని వద్ద జరిపిన విచారణలో అతడు చెప్పిన అంశాలు పోలీసులకు షాక్‌నిచ్చాయి. ఇతడు ఓ తీవ్రవాద సంస్థకు చెందిన వాడని.. అత్యంత కిరాతకుడిగా ముద్ర వేసుకున్నాడు. 
 
1990 దశకంలో అతని నేతృత్వంలోని సైన్యం వందలాది మందిని హతమార్చాడు. చిన్నారులను సైనికులుగా మార్చడమే కాకుండా.. బహిరంగంగా మహిళపై అత్యాచారాలు, హత్యలు చేశాడు. 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయి... అక్కడే సెటిలయ్యాడు.
 
ఫిలడెల్ఫియాలో బిజినెస్‌ మ్యాన్‌గా స్థిరపడ్డాడు. ఆపై 15 సంవత్సరాల తర్వాత యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. సాక్ష్యాధారాలు కూడా బలంగా వుండటంతో అతనికి కఠిన కారాగార శిక్ష ఖాయమని తెలుస్తోంది. గురువారం అతనికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో జబ్బతెహ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సినిమా ఇండ‌స్ట్రీని ప్ర‌క్షాళ‌న చేయాలి : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య

'తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడీ' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ...

news

వేధింపు పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయాలి : కోదండ‌రాం

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని ...

news

నన్ను కూడ రేప్ చేసి చంపేస్తారు... అసిఫా బాను న్యాయవాది

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై హత్య కేసు దేశ ...

news

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ ...

Widgets Magazine