Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిరియా సంక్షోభం: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కండి: రష్యా మీడియా

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (17:01 IST)

Widgets Magazine

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా వుండండంటూ.. ఆ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది..రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆ దేశ మీడియా సూచించింది. ఈ మేరకు కొన్ని ముందస్తు సూచనలు కూడా ఇచ్చింది. 
 
బాంబు షెల్టర్లో వున్న ఐయోడిన్ ప్యాకెట్లను దగ్గర వుంచుకుని రేడియేషన్‌కు గురికాకుండా శరీరానికి రాసుకోవాలని.. ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. సిరియా అంతర్యుద్ధంలో భాగంగా ప్రపంచం రెండో క్షిపణులు క్రైసిస్‌ను ఎదుర్కొంటుందని రష్యా దేశ రక్షణ నిపుణులొకరు తెలిపారు. తొలి కోల్డ్‌ వార్‌ కంటే ఈ వార్‌ అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించారు.
 
ఏడు సంవత్సరాలుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందని రష్యా మీడియా హెచ్చరించింది. సిరియాపై అమెరికా అణు దాడి జరిపేందుకు సిద్ధంగా ఉందని, అణ్వస్త్రాలను అమెరికా సిద్ధం చేసిందని అభిప్రాయపడింది. సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ జరుపుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ, రష్యా చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ తిరస్కరించిన నేపథ్యంలో మీడియా సంస్థలు వరల్డ్ వార్ హెచ్చరికలు జారీ చేశాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పీకేజీ.. ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు?: శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించింది. టాలీవుడ్ కాస్టింగ్ ...

news

తొమ్మిదేళ్ల బాలికపై దారుణం.. శరీరంపై 86 గాయాలు.. అత్యాచారం, హత్య

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలను మరవకముందే.. మరో దారుణమైన ...

news

రజనీ బీజేపీకి కొమ్ముకాస్తున్నారు.. తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు?

దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ ...

news

కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్పందన.. ఇట్స్ ఓకే.. బట్ అసంతృప్తే: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో పోరు బాట పట్టిన శ్రీరెడ్డి.. పవర్ ...

Widgets Magazine