శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (16:55 IST)

ఆ ఇద్దరిని వరించిన మెడిసిన్ నోబెల్ ప్రైజ్.. కేన్సర్ మహమ్మారిపై పోరాటం

వైద్య రంగానికి సంబంధించిన ఇద్దరికి నోబెల్ ప్రైజ్‌లను సోమవారం ప్రటించారు. కేన్సర్ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వరించింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవ

వైద్య రంగానికి సంబంధించిన ఇద్దరికి నోబెల్ ప్రైజ్‌లను సోమవారం ప్రటించారు. కేన్సర్ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వరించింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు సోమవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ కమిటీ వెల్లడించింది.
 
అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి చికిత్స కోసం ఇద్దరూ వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇమ్యూన్ చెక్‌పాయిట్ థెరపీని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. దీంతో కేన్సర్ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతేకాదు ఈ చికిత్స విధానం వచ్చిన తర్వాత కేన్సర్‌పై ఉన్న అపోహాలు కూడా తొలిగినట్లు తెలుస్తోంది. 
 
కేన్సర్ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రతి ఏడాది కేన్సర్ వల్ల లక్షల మంది ప్రాణాలు విడుస్తున్నారు. మానవాళి మనుగడకు ఈ వ్యాధి ఓ సవాల్‌గా మారింది. అయితే ప్రాణాంతక ట్యూమర్ కణాలను చంపేందుకు ఓ కొత్త తరహా నిరోధక వ్యవస్థకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. కేన్సర్ చికిత్స కోసం ఈ ఇద్దరూ ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఫలితంగా వీరికి నోబెల్ పురస్కారం వరించింది.