గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (10:29 IST)

ఒక్క అణు బాంబుతో అమెరికా మటాష్ : ఉత్తర కొరియా హెచ్చరిక

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ... నార్త్ కొరియా డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చింది. ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ప్రారంభమవుతుందని ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా డిప్యూటీ బ్రాండ్

అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ... నార్త్ కొరియా డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చింది. ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ప్రారంభమవుతుందని ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా డిప్యూటీ బ్రాండ్ అంబాసడర్ కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు. ఇపుడు అమెరికా మొత్తం తమ గుప్పెట్లో ఉందని, ఒక్క అణుబాంబుతో ఆ దేశాన్ని బూడిద చేస్తామంటూ గర్జించారు. 
 
పైగా, అమెరికా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అందువల్ల తాము చేపట్టిన అణు, క్షిపణి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని ఐక్యరాజ్యసమితిలో పునరుద్ఘాటించారు. అమెరికా నుంచి తమకు అణు ముప్పు తొలిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు.
 
1970 నుంచి అమెరికా కేవలం ఉత్తర కొరియాను మాత్రమే అణు దాడులకు టార్గెట్ చేసుకుందని... ఆత్మ రక్షణ కోసం అణ్వాయుధాలను కలిగి ఉండటం తమ హక్కు అని కిమ్ ఇన్ ర్యాంగ్ తెలిపారు. అణు పరీక్షలు ప్రతి యేటా తాము నిర్వహించే మిలిటరీ డ్రిల్‌లో ఒక భాగమని, అయితే తమ దేశ అగ్రనాయకత్వాన్ని అంతం చేసేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ అన్నింటికన్నా ప్రమాదకరమైందని హెచ్చరించారు.