శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (18:26 IST)

డొనాల్ట్ ట్రంప్‌ చేయిపట్టుకుంటే.. మెలానియా ట్రంప్ ఇలా? (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ఆయనతో చేతులు కలిపి నడిచేందుకు నిరాకరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఒహియో వెళ్లేటప్పుడూ ట్రంప్‌కు అద

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ఆయనతో చేతులు కలిపి నడిచేందుకు నిరాకరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఒహియో వెళ్లేటప్పుడూ ట్రంప్‌కు అదే పరిస్థితి ఎదురైంది.

సోమవారం ఓహియోకు ట్రంప్ దంపతులు బయల్దేరారు. ఆ సమయంలో ఇంటి ముందు నడుస్తూ వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. మెలానియా చేతులు పట్టుకుని నడిచేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఆమె అందుకు నిరాకరించారు. కానీ పొడవాటి ఓవర్ కోట్ ధరించడంతోనే మెలానియా చేయిని ట్రంప్ అందుకోలేకపోయారు. దీంతో వారిద్దరూ విడివిడిగానే నడుచుకుంటూ విమానం ఎక్కారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ లుక్కేయండి.