Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:11 IST)

Widgets Magazine

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సలహా ఇచ్చారు.

ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా, మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా నేతృత్వంలో సమావేశం నిర్వహించారని ఉండవల్లి గుర్తు చేసారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు వారితో కలిసి ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం చంద్రబాబు చేతుల్లో వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 
 
చంద్రబాబు మోదీకి బుద్ధి చెప్పాలంటే.. ఇదే సరైన తరుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసులకు, జైళ్లకు భయపడటం మానేసి.. ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.

దేశంలో జ్యుడీషియరీని ఎదుర్కోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అంటూ ఉండవల్లి విమర్శించారు. కాబట్టి కేసీఆర్ తరహాలో ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి సూచించారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : సుప్రీం న్యాయమూర్తుల అరెస్టు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు ...

news

భర్త నుంచి కాపాడాలంటూ భార్య అరణ్య రోదన (వీడియో)

ముంబైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలంటూ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోలీసులకు ...

news

భువనగిరిలో హాట్ కాలింగ్ : బూతు మాటలు మాట్లాడటమే ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన ...

news

ఉత్తరప్రదేశ్‌లో 40 మందికి హెచ్ఐవీ.. కారణమిదే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ఏకంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. దీనికి కారణం ...

Widgets Magazine