ఐపీఎల్-11వ సీజన్.. నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్..

ఐపీఎల్-11వ సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. బట్లర్ చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ గెలుపును నమోదు చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో రెం

mumbai indians
selvi| Last Updated: మంగళవారం, 15 మే 2018 (11:21 IST)
ఐపీఎల్-11వ సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. బట్లర్ చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ గెలుపును నమోదు చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి వుండగానే పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ముంబైకి చెక్ పెట్టింది. 
 
టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఐదో బంతికే షార్ట్ ఔటైనా.. బట్లర్, రహానే నిలకడగా ఆడారు. జోడీని విడదీసేందుకు రోహిత్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా వీలులేకపోయింది. విజయం దిశగా సాగుతున్న రాజస్థాన్‌కు 14వ ఓవర్‌లో రహానే వికెట్ రూపంలో చుక్కెదురైంది. 
 
బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించి వెనుదిరిగాడు. ఈ దశలో 26 పరుగులు చేసిన శామ్సన్ ఔటైనా.. బట్లర్ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.దీనిపై మరింత చదవండి :