Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎయిర్‌టెల్ రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్.. అపరిమిత కాల్స్

సోమవారం, 22 జనవరి 2018 (16:32 IST)

Widgets Magazine
airtel

దేశీయ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించిన తర్వాత ఈ ధరల పోటీ మరింత తారా స్థాయికి చేరిన విషయం తెల్సిందే. అదేసమయంలో వినియోగదారులను ఆకర్షించడానికి, వారికున్న కస్టమర్లను కోల్పోకుండా ఉండటానికి ఆయా కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. 
 
ఈ కోవలో ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలోనూ మార్పు చేస్తున్నాయి. ఇటీవలే, రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2018 ఆఫర్‌ పేరుతో ఇప్పటికే ఉన్న ప్లాన్లలోనే మార్పులు చేసింది.  తాజాగా ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.149 ప్లాన్‌ను మార్చింది.
 
మార్చిన ప్లాన్ ప్రకారం, రూ.149 రీచార్జ్‌పై అన్ని నెట్ వర్క్‌లకు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 1జీబీ డాటాను ఇవ్వనుంది. కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. గతంలో ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మాత్రమే అపరిమిత కాలింగ్‌ సౌకర్యం ఉండేది. ఇపుడు అన్ని నెట్‌వర్క్‌లకు కల్పించింది. 
 
మరోవైపు, రిలయన్స్ జియో సైతం రూ.149 ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్.. రోజుకి 1జీబీ డాటాను అందజేస్తోంది. దీని కాలపరిమితి కూడా 28 రోజులే. ఎయిర్‌టెల్, జియో రెండూ 28 రోజుల కాలపరిమితితో రూ.149కే ప్లాన్ అందిస్తున్నప్పటికీ ఎయిర్‌టెల్ 28 రోజులకు కలిపి 1జీబీ డాటా ఇస్తుండగా.. రిలయన్స్ జియో రోజుకి 1జీబీ డాటా చొప్పున ఇస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఒక్క రూపాయికే అపరిమిత డేటా.. ఎవరు? ఎక్కడ?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కెనడాకు చెందిన ...

news

ఫేస్‌బుక్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేస్తే ఫైన్... ఎక్కడ?

ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియాలు జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఈ రెండు ఖాతాలు లేనివారు ...

news

మొబైల్ యాప్‌ల వినియోగం: అమెరికాను వెనక్కి నెట్టిన భారత్

మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా ...

news

హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త ఫీచర్

హావాయ్ సంస్థకు చెందిన హాన‌ర్ వ్యూ10 స్మార్ట్‌ఫోన్ల‌కు కొత్త అప్‌డేట్‌ను విడుద‌ల ...

Widgets Magazine