Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌లో టూ వీలర్ మోడ్- ప్లే స్టోర్‌లో గూగుల్ గో యాప్

మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:37 IST)

Widgets Magazine
google search

సెర్చింజన్ గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలియని వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో టూ వీలర్ మోడ్ కూడా చేరిపోయింది. గూగుల్ మ్యాప్స్‌ను అప్ డేట్ చేస్తే ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్లు ప్రయాణించేందుకు వీలుకాని ఇరుకు రోడ్లు ఉన్న కొన్ని దేశాల్లో ఈ టూ-వీలర్ ఫీచర్‌ని గూగుల్ ఆవిష్కరించింది. 
 
ఇప్పటికే కారు, బస్సు, కాలినడక ద్వారా గమ్యస్థానానికి వెళ్లే దారుల సమాచారాన్నిచ్చే గూగుల్.. ప్రస్తుతం టూవీలర్ మోడ్‌ని కూడా చేర్చింది. దీనిద్వారా గమ్యస్థానాన్ని సులభంగా కనిపెట్టవచ్చు. అంతేకాకుండా గమ్య‌స్థానంలో టూ వీల‌ర్ పార్కింగ్ ప్ర‌దేశాల‌ను కూడా మ్యాప్‌లో చూపిస్తుంది. మోటార్ బైకులు అత్యధికంగా వాడే భారతీయ వినియోగదారులకు ప్రత్యేకంగా సదుపాయాన్ని ఆవిష్కరించారు.
 
మరోవైపు.. ప్లే స్టోరులో డేటాను తక్కువగా వినియోగించుకునే రీతిలో గూగుల్ గో పేరుతో ఓ సెర్చింజన్ యాప్‌ను కూడా గూగుల్ ఆవిష్క‌రించింది. తక్కువ డేటా, నెట్‌వర్క్ స్లో, తక్కువ స్టోరేజీ వున్న వినియోగదారుల కోసం ఈ యాప్ సహకరిస్తుంది. ఈ యాప్ త‌క్కువ డేటాను వినియోగించుకోవ‌డ‌మే కాకుండా సెర్చ్ ఫ‌లితాల‌ను కూడా చాలా వేగంగా అంద‌జేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవోగా సలీల్‌ పరేఖ్‌

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ ఎట్టకేలకు కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ...

news

వాట్సాప్ సర్వర్ క్రాష్... సేవలకు అంతరాయం

సామాజిక ప్రసార మాద్యమాల్లో ఒకటైన వాట్సాప్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. దీనికి ...

news

స్మార్ట్ ఫోన్లకు డేంజర్ యాప్స్ ఇవే... ఆ రెండు వద్దనే వద్దు...

చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో ట్రూ కాలర్‌, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్స్‌‌ను ...

news

రెడ్ మీ 5ఏ ఫోన్లపై బంపర్ ఆఫర్.. ఓన్లీ ఇండియన్ కస్టమర్లకే...

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తమ సరికొత్త మొబైల్‌ "5ఏ"ను భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి విడుదల ...

Widgets Magazine