శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (13:21 IST)

మూతపడిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. ఎందుకంటే...

భారతీయ రైల్వే అనుబంధ సంస్థగా ఉన్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన వెబ్‌సైట్ శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూతపడనుంది. మెయింటినెన్స్ పనుల్లో భాగంగా, ఈ వెబ్‌సైట్‌ను కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్స్‌ సేవలను మెయింటెనెన్స్ కోసం శని, ఆదివారాల్లో కొన్ని గంటల పాటు నిలిపివేయనున్నామనీ, వినియోగదారులకు  కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మే 18, 2019 శనివారం, మే 19 ఆదివారం మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు.
 
ఈ కారణంగా తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝామున 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపింది.