శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (13:49 IST)

అదిరిపోయే ఫీచర్లతో రేజర్ స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే?

రేజర్ సంస్థ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఓ స్మార్ట్ ‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోనుకు రేజర్ అనే పేరు పెట్టింది. లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో రేజర్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. నెక్స్‌బిట్ కంపెనీని సొంతం చేసు

రేజర్ సంస్థ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఓ స్మార్ట్ ‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోనుకు రేజర్ అనే పేరు పెట్టింది. లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో రేజర్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. నెక్స్‌బిట్ కంపెనీని సొంతం చేసుకున్నాక రేజర్ విడుదల చేసిన ఫోన్ ఇదే కావడం విశేషం. దీనికి హెడ్ ఫోన్ అక్కర్లేదు. 
 
కాగా రేజర్ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఇమిడివున్నాయి. ఇందులో 5.72 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అది అల్ట్రామోషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను అమర్చగా, ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియం మెటల్‌తో తయారు చేశారు. ఇది ఫోన్ ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. ఇక ఈ ఫోన్ ఈ నెల 17వ తేదీ నుంచి యూజర్లకు లభ్యం కానుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.59వేల వరకు ఉండే అవకాశం ఉంది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే... 5.72 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ అల్ట్రామోషన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఓరియో), 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి వాటితో ఈ ఫోనును తయారు చేశారు.