Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో మాస్ ప్లాన్... రూ.98కే అన్‌లిమిటెడ్ కాలింగ్

గురువారం, 25 జనవరి 2018 (12:35 IST)

Widgets Magazine
reliance jio

దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ముందుకువచ్చింది. జియో మాస్ ప్లాన్ పేరుతో దీన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.98కే ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు నెలకు 2జీడీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. మరింత మంది కస్టమర్లను సంపాదించేందుకు రిలయన్స్ జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
దేశంలో జియో టెలికాం సేవలు ప్రారంభమైన తర్వాత అతి తక్కువ ధరలకే 4జీ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ రంగంలో అప్పటికే ఉన్న కంపెనీలకు జియో తేరుకోలని షాకిచ్చింది. ఇపుడు మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. జియో తాజాగా ప్రకటించిన రూ.98 ప్లాన్‌ను ప్రకటించింది. 
 
ఈ ప్రాన్ ప్రకటించిన తర్వాత భారతీ ఎయిర్‌టెల్ షేరు విలువ 6.51 శాతం, ఐడియా కంపెనీ షేరు విలువ రూ.5.38 శాతం మేరకు పడిపోయింది. ఈ ప్లాన్‌పై టెక్ నిపుణులు స్పందిస్తూ, జియో మాస్ ప్లాన్ వల్ల సగటున ఓ యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) మరింత తగ్గుతుందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. జియో 98 ప్లాన్ అర్థవంతమైన ప్లాన్ అని క్రెడిట్ సూసే పేర్కొంది. దీనివల్ల పోటీ సంస్థలకు మరిన్ని నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

గణతంత్ర దినోత్సవ ఆఫర్లు : స్మార్ట్ ఫోన్లపై రూ.10వేల క్యాష్ బ్యాక్

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ...

news

ఎయిర్‌టెల్ రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్.. అపరిమిత కాల్స్

దేశీయ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన సేవలను ...

news

ఒక్క రూపాయికే అపరిమిత డేటా.. ఎవరు? ఎక్కడ?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కెనడాకు చెందిన ...

Widgets Magazine