Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందరూ సమానమేనంటున్న ట్విట్టర్.. వెరిఫికేషన్ టిక్ తొలగింపు

శుక్రవారం, 10 నవంబరు 2017 (16:23 IST)

Widgets Magazine
twitter

సాధారణంగా ట్విట్టర్ ఖాతా పేరు పక్కన నీలం రంగులో చెక్ మార్క్ వుంటే, అది వ్యక్తుల వెరిఫైడ్ అకౌంట్ అని అర్థం. అయితే ట్విట్టర్ ధృవీకరించిన ఈ నీలిరంగు చెక్ మార్క్‌ను ప్రస్తుతం తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఈ చెక్ మార్క్ విషయంలో ట్విట్టర్‌పై కొందరు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విధానానికి స్వస్తి చెపుతున్నట్టు పేర్కొంది. 
 
దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ, 'వెరిఫికేషన్‌ అనేది సదరు ఖాతా ఆ వ్యక్తిదే అని ధృకరించేందుకు చేస్తాం. కానీ అదీ కీలక, ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారనే భావన చాలా మంది నెటిజన్లలో కలిగింది. అందుకే ఈ తరహా భావనను తొలగించేందుకు ట్విట్టర్‌ వెరిఫికేషన్‌ను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ తీసుకొస్తాం' అంటూ వివరణ ఇచ్చింది. 
 
దీనిపై ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే కూడా స్పందిస్తూ, 'వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను మా సిబ్బంది సరిగ్గానే చేస్తున్నారు. అయితే చెక్‌మార్క్‌ వల్ల గందరగోళం తలెత్తిందని తెలిసింది. దీన్ని సరిచేసే పనిలో ఉన్నాం' అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, అసలు ఈ వివాదం తలెత్తడానికి ప్రధానమైన కారణం లేకపోలేదు. గత ఆగస్టు నెలలో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో శ్వేతజాతీయుల ఆధిపత్య ర్యాలీ జరిగింది. జాసన్‌ కెస్లర్‌ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. అతనికున్న ట్విట్టర్ ఖాతాలో అతడి పేరు పక్కన వెరిఫైడ్‌ చెక్‌ మార్క్‌ ఉంది. దీంతో అలాంటి ఆధిపత్య ధోరణి కలిగిన వ్యక్తికి ధ్రువీకరణ ఎలా ఇస్తారు అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తూ, విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వెరిఫైడ్ టిక్‌ను తొలగిస్తూ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఐఫోన్ 7కు ఆర్డర్‌ చేస్తే 'ఘడీ' సబ్బు వచ్చింది... (వీడియో)

ఆన్‌లైన్ మోసాలకు అడ్డే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల సేవలు అందుబాటులోకి ...

news

ఫ్లిప్‌కార్ట్‌ తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఫీచర్లేంటంటే...

ఇప్పటివరకు కొరియర్ సంస్థగా పనిచేసిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ ...

news

1000 అడుగుల ఎత్తు నుంచి పడేసిన ఆపిల్ ఫోన్‌కు ఏమైంది? (Video)

ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ...

news

రిలయన్స్ జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. జియోకు ధీటుగా వివిధ ...

Widgets Magazine