Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్‌ను ప్రారంభించిన విప్రో

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (15:16 IST)

Widgets Magazine

 
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో తాజాగా ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ షోను ఏర్పాటు చేసింది. ఇండోర్, ఔట్‌డోర్ లైటింగ్ సౌలభ్యం కోసం ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ (ఐఓఎల్) సొల్యూషన్ పేరుతో స్మార్ట్ అండ్ కనెక్టెడ్ ఇండోర్ మరియు ఔట్‌డోర్‌ల కోసం లైట్ షో ప్రదర్శనను ఇటీవల ఏర్పాటు చేసింది. 
 
ఇదే అంశంపై విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ విభాగం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మకరానంద్ సైనీస్ మాట్లాడుతూ, లైటింగ్ రంగంలో గత 25 యేళ్లుగా సేవలు అందిస్తున్న తాము వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తమ ఆవిష్కరణలు ఉంటున్నాయన్నారు. ఇపుడు తాము ఆవిష్కరించిన ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ లైంటింగ్ రంగంలో తిపెద్ద మార్పుగా ఆయన అభివర్ణించారు.
wipro
 
ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో లైటింగ్ షోను విప్రో కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో సరికొత్త లైటింగ్ ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచింది. అంతేకాకుండా, ఈ లైటింగ‌తో ఇంటర్నెట్, సీసీటీవీ టెక్నాలజీని అనుసంధానం చేయడం గమనార్హం. గత యేడాది పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ప్రాడక్ట్ డిజైన్లు, ఆవిష్కరణలు, క్వాలిటీ ఎక్స్‌లెన్స్ తదితర విభాగాల్లో ఈ అవార్డులు ఉన్నట్టు తెలిపారు. 
 
కాగా, విప్రో ఎంటర్‌ప్రైజెస్ సంస్థలో విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూపు ఓ అనుబంధ విభాగంగా ఉంది. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ రంగంలో ఇది ఒకటన్నారు. విప్రో కేర్ వ్యాపారంలో పర్సనల్ వాష్ ప్రాడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రాడక్ట్స్, బేబీ కేర్ ప్రాడక్ట్స్, వెల్నెస్ ప్రాడక్ట్స్, ఎలక్ట్రికల్ వైర్ డివైసెస్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ లైటింగ్, మాడ్యులర్ ఆఫీసర్ ఫర్నీచర్ వంటి అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్... వస్తువులను కొనండి, అమ్ముకోండి...

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ...

news

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏకంగా 50శాతం వేతనాల పెంపు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ...

news

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ ...

news

స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్: పూణేలో 150 గూగుల్ స్టేషన్లు

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ...

Widgets Magazine