Widgets Magazine

బోర్ కొట్టిస్తున్న ఫేస్‌బుక్.. రారమ్మంటున్న ఇన్‌స్టాగ్రామ్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:43 IST)

Facebook

ఫేస్‌బుక్ (ముఖ పుస్తకం) పేరు వినని వారుండరు. యూత్‌లో ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ ఖాతాను ఉండివుంటుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల ఖాతాలను కలిగివుంది. అలాంటి ఫేస్‌బుక్‌ బోర్ కొట్టిస్తోందట. ఫేస్‌బుక్‌ను వాడుతున్న యూత్ నెమ్మదిగా ముఖం చాటేస్తున్నారు. ఇది ఫేస్‌బుక్ యాజమాన్యానికి నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది. 
 
ఫేస్‌బుక్‌ను వాడుతున్న యూత్ నెమ్మదిగా ముఖం చాటేస్తుంటే... కొత్తగా వచ్చిన స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఆశ్రయిస్తున్నారు. యువ ఖాతాదారులు (25 ఏళ్లలోపు వారు) వైదొలగుతుండగా, పెద్దలు మాత్రమే మిగులుతున్నట్టు ఓ ఆన్‌లైన్ సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల వయసువారిలో 5.8 శాతం మంది ఫేస్‌బుక్‌ను వదిలేశారని 'ఇమార్కెటర్' రిపోర్టు పేర్కొంది. 
 
ముఖ్యంగా అమెరికాలో ఫేస్‌బుక్‌ను ఈ సమస్య బాధిస్తోందని తెలిపింది. 12 నుంచి 17 సంవత్సరాల వయసువారిలో దాదాపు 6 శాతం మంది, 12 ఏళ్లలోపు వారిలో 9.3 శాతం మంది ఫేస్‌బుక్‌కు టాటా చెప్పారని తెలిపింది. తదుపరి రెండు మూడేళ్ల వ్యవధిలో 25 ఏళ్లలోపున్న ఖాతాదారుల్లో 20 లక్షల మందిని ఫేస్‌బుక్ ఖాతాలను క్లోజ్ చేయవచ్చని ఆ సంస్థఓ అంచనా వేసింది. కాగా, ప్రస్తుతం యూఎస్‌లో ఫేస్‌బుక్‌కు 16.95 కోట్లు, ఇన్ స్టాగ్రామ్‌కు 10.47 కోట్లు, స్నాప్‌చాట్‌కు 8.65 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫోన్ పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే?

ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ...

news

ప్రేమికుల దినోత్సవం.. వీవో ఫోన్లపై అమేజాన్ ఆఫర్లు..

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ డాట్ ఇన్ ప్రత్యేక ...

news

వాట్సాప్‌ నుంచి పేమెంట్స్ కొత్త ఫీచర్..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో ...

news

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్.. ''కూల్'' పేరిట రూ.1099 రీఛార్జ్ చేసుకుంటే?

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో రోజుకో ఆఫర్‌తో ప్రకటిస్తున్న టెలికాం సంస్థలతో ...

Widgets Magazine