శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (15:04 IST)

ఎదిగే పిల్లలు పిస్తా తప్పక తినాలి.. ఎందుకు?

ఎదిగే పిల్లలు పిస్తా పప్పుల్ని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిస్తా పప్పుల్లో విటమిన్ బి6 అధికం. ఇది హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రతిరోజూ గుప్పెడులో సగం పిస్తా తీసుకోవడం వల

ఎదిగే పిల్లలు పిస్తా పప్పుల్ని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిస్తా పప్పుల్లో విటమిన్ బి6 అధికం. ఇది హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. ప్రతిరోజూ గుప్పెడులో సగం పిస్తా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ ఇ లభిస్తుంది. పిస్తాల్లోని పీచు సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. 
 
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి… కొత్త కణాల వృద్దిని ప్రోత్సహిస్తాయి. కంటి సమస్యలతో బాధపడే వారు వీటిని తరచూ తీసుకుంటే మంచిది. కంటిచూపుకు పిస్తా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కెరొటినాయిడ్లూ, లూటిన్ అధికంగా లభిస్తాయి.
 
ఊపిరితిత్తుల నుంచి ఇతర అవయవాలకు సరిపడా ప్రాణవాయువుని చేరవేయడంలో పిస్తా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి6 రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లకు దూరంగా వుంచుతుంది. అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. ముడతలను దూరం చేస్తుంది. పిస్తాలోని ఇతర పోషకాలు చర్మ క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడతాయి.