శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (17:03 IST)

ఆ మృగాళ్లను బహిరంగంగా ఉరితీయాలి : భోపాల్ గ్యార్ రేప్ బాధితురాలు

తనపై అత్యంతక్రూరంగా, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వంతులవారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన మృగాళ్లకు ఈ సమాజంలో బతికే అర్హత లేదని అందువల్ల వారిని అందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీయాలని భోపాల్ గ్యాంగ

తనపై అత్యంతక్రూరంగా, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వంతులవారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన మృగాళ్లకు ఈ సమాజంలో బతికే అర్హత లేదని అందువల్ల వారిని అందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీయాలని భోపాల్ గ్యాంగ్ బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగర శివారు ప్రాంతానికి చెందిన 19 యేళ్ల విద్యార్థిని ఐఏఎస్ శిక్షణ తీసుకుంటోంది. ఈమెను హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్‌కు కూతవేటుదూరంలో నలుగురు కామాంధులు నాలుగు గంటల పాటు అత్యాచారం జరిపిన విషయం తెల్సిందే. 
 
అత్యాచార ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఘటనా స్థలికి దగ్గర్లోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు తనను కాపాడలేక పోయారని... తనను కిడ్నాప్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకుని కూర్చుండిపోయారని మండిపడ్డారు. 
 
తాను పోలీసు అధికారి కుమార్తె అని చెప్పకపోయి ఉంటే... అత్యాచారం తర్వాత తనను హత్య చేసి ఉండేవారన్నారు. హబీబ్ గంజ్ పోలీస్ అధికారుల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని ఆమె దుయ్యబట్టారు. 
 
మరోవైపు ఈ కేసు విషయంలో అలసత్వం వహించిన ఐదుగురు పోలీసులను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. అలాగే, కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాస్తు బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.