సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (13:19 IST)

పెళ్లైన తర్వాత అలా జరిగిందని.. భర్తతో చెప్పింది..?

హర్యానాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా జిల్లాకు చెందిన జితేందర్ అనే వ్యక్తికి గత 2015వ సంవత్సరం వివాహం జరిగింది. 
 
వివాహానికి అనంతరం తాను గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు తెలిపింది. అంతేగాకుండా తనను వదిలించుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో షాక్ అయిన జితేందర్ భార్యను ఓదార్చాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సంసారం చేసేందుకు సై అన్నాడు. ఇంకా.. వివాహమైనప్పటి నుంచి తన భార్యపై విరుచుకుపడిన కామాంధులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. 
 
ఇంకా తన ఆస్తిని అమ్మి నిందితులకు శిక్ష పడేలా కేసును నడిపిస్తున్నాడు. దీంతో జితేందర్‍‌కు నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న విషయాలపై గొడవపడి.. విడాకుల వరకు వెళ్లే దంపతుల మధ్య.. ఇలాంటి వ్యక్తిని చూడటం అరుదని.. నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.