ఒకే చీరతో ఉరేసుకున్న దంపతులు..

Last Updated: శుక్రవారం, 11 జనవరి 2019 (15:29 IST)
ఒకే చీరతో దంపతులు ఉరేసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరు సమీపంలో పల్లడం ప్రాంతానికి చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి పెళ్లైన కొద్ది రోజుల్లో తన భార్యతో కలిసి తిరుప్పూరులో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తెల్లారినా చాలాసేపటి వరకు ఇళ్లు మూతపడే వుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు కూడా ముత్తు కృష్ణన్ ఇంటికి చేరుకుని.. తలుపులు పగులకొట్టారు. చివరికి ఇంటిలోనికెళ్లి చూశారు. అంతే షాక్ తిన్నారు. ముత్తుకృష్ణన్ ఆయన సతీమణి ఒకే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణాలేంటి..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :