చెన్నైలో మళ్లీ మూగజీవిపై దారుణం: కుక్క మెడకు తాడు కట్టి ఇద్దరూ చెరో వైపు లాక్కెళ్లారు

గురువారం, 12 అక్టోబరు 2017 (16:23 IST)

గత ఏడాది ఓ భవనం నుంచి కుక్కను కిందికి తోసేసిన మెడికల్ స్టూడెంట్ ఘటన మరవకు ముందే.. అదే చెన్నైలో మరో ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం అపార్ట్‌మెంట్ భవనం నుంచి ఓ కుక్కను కిందికి తోసేస్తూ సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియో వైరల్ అయ్యింది. 
 
ఇందులో భవనం నుంచి శునకాన్ని కిందికి తోసేసిన మెడికల్ స్టూడెంట్‌ను అతడు చదివే మెడికల్ కళాశాల సస్పెండ్ చేసింది. ఇలా మూగ జీవాల‌ను హింసించడ‌మే కాకుండా ఆ సంద‌ర్భంగా తీసిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘ‌ట‌న‌లు ప‌లుసార్లు చెన్నైలో వెలుగు చూశాయి. 
 
తాజాగా ఓ శునకం మెడకు తాళ్లు కట్టి ఇద్దరు దాన్ని లాక్కెళ్లారు. ఆ మూగ జీవి మెడలో కట్టిన తాడుతో శ్వాస తీసుకోలేక బాధ‌తో అరుపులు పెట్టినా వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేన‌కా గాంధీ స్పందించి, విచార‌ణ‌కు ఆదేశించారు. 

ఆ మూగ‌జీవిని హింసించిన వారిపై బ్లూ క్రాస్ సంస్థ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘ‌ట‌న చెన్నై తాంబరంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూష‌న్‌లో జ‌రిగిన‌ట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :  
Video Dog Chennai Tambaram Blue Cross Menaka Gandhi Private Institution

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆరుషి కేసు: తల్లిదండ్రులు నిర్ధోషులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ...

news

పైఅధికారి భార్యతో వివాహేతర సంబంధం... సైనిక కోర్టులో అతడికి శిక్ష ఏమిటో తెలుసా?

వివాహేతర సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక ...

news

జగన్ ఎన్నికలకే ఖర్చు పెట్టడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం..?: లక్ష్మీపార్వతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దివంగత ఎన్టీఆర్ సతీమణి ...

news

డేరా బాబా పీఏ రాకేష్, న్యాయసలహాదారుకు వృషణాలు లేవు.. సీబీఐ షాక్

డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు జీవితం ...