తాతయ్యను టార్గెట్ చేసిన యువతి.. శోభనం రోజు రాత్రి..?

marriage
Last Updated: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:02 IST)
డబ్బు కోసం వృద్ధులను యువతులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధుడిని పెళ్లాడిన యువతి.. శోభనం రాత్రి నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌‌కు చెందిన మహ్మద్ ముస్తఫా (70)కు గత రెండు రోజుల క్రితమే పెళ్లైంది. అదీ మనవరాలు వయస్సున్న నజ్మా (28)ను ముస్తఫా పెళ్లాడాడు. 
 
శోభనం రోజు ఆ రాత్రి వృద్ధుడి తొలి భార్య నజ్మాకు నగలన్నీ అప్పగించింది. ఆ నగలను చూసి షాకైన నజ్మా.. ముస్తఫాను పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి.. నగలతో పారిపోయింది. మత్తు దిగాక మరుసటి రోజు నిద్రలేచి చూసిన ముస్తఫాకు షాక్ తప్పలేదు. ఇంట్లో వున్న నగదు, నగలతో పాటు విలువైన వస్తువులతో నజ్మా పారిపోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నజ్మా కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలో యువతులు వృద్ధులను పెళ్లాడి.. వారి నుంచి భారీగా నగదును, బంగారాన్ని దోచేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.దీనిపై మరింత చదవండి :