గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (16:47 IST)

విందుకు పిలిచాడు.. కడుపు నిండా వడ్డించాడు.. ఐతే తొమ్మిది మంది మృతి?

బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధ

బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖుర్ద్ గ్రామంలో తొమ్మిది తమ బంధువు ఇంటికి వెళ్లారు. భోజనం చేశారు. మందు కొట్టారు. అయితే ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై  ప్రాణాలు కోల్పోయారు. వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విష‌యాన్ని పోలీసులకు కూడా తెల‌ప‌లేదు. ఆయ‌న‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. 
 
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆహారంలో విషం పెట్టే తొమ్మిది మంది బంధువులను విందు ఏర్పాటు చేసిన వ్యక్తి చంపించి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.