కాన్పూర్‌లో కట్టలు కట్టలుగా పాత నోట్లు.. (వీడియో)

రద్దైన నోట్లు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని ఓ తాళం వేసిన ఇంటిలో వీటిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు గుర్తించారు.

currency
pnr| Last Updated: బుధవారం, 17 జనవరి 2018 (11:27 IST)
రద్దైన నోట్లు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని ఓ తాళం వేసిన ఇంటిలో వీటిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు గుర్తించారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఇంటిలో సంయుక్త తనిఖీలు నిర్వహించగా, ఈ పాత నోట్ల కట్టలు వెలుగు చూశాయి.

వీటి విలువ సుమారు రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ డబ్బు ఎవరిది.. ఇక్కడ ఎందుకు పెట్టారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై ఎన్.ఐ.ఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. ఆదాయపన్ను శాఖకు చెందిన అధికారులు వాళ్లను విచారిస్తున్నారు. ఓ వ్యక్తి ఇంట్లో రద్దు అయిన పాత కరెన్సీ భారీ మొత్తంలో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, దాని ఆధారంగా దాడులు చేశామని కాన్పూర్ ఎస్సీ ఏకే మీనా తెలిపారు. 2016, నవంబర్ 8వ తేదీన రూ.500, వెయ్యి నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై మరింత చదవండి :