శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (09:56 IST)

'ఆపరేషన్ కమలం' స్టార్ట్.. అర్థరాత్రి హైడ్రామా.. గాల్లో ఎగరని విమానాలు

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులోభాగంగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులోభాగంగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో తమతమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సిద్ధమయ్యాయి.
 
మరోవైపు, ఆపరేషన్ కమలం నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమ ఎమ్మెల్యేలను కేరళ రాష్ట్రానికి తరలిచాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. కొచ్చిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఎమ్మెల్యేలు ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు స్పెషల్ ఫ్లైట్‌లను కూడా బుక్ చేశాయి. అయితే, ఆ విమానాలు బయల్దేరేందుకు డీజీసీఏ అనుమతించలేదు. 
 
దీంతో ఎమ్మెల్యేలను రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఎంత మందిని హైదరాబాద్ తరలించారు అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు కొంత మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. లింగాయత్‌ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానం ఆ పార్టీ నేత శివశంకరప్పకు అప్పగించింది. గురువారం అసెంబ్లీ ముందు గొడవ చేసిన తర్వాత అందర్నీ మళ్లీ రిసార్టుకు తరలించారంటేనే ఎంతలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
 
ఎమ్మెల్యేలు, వారి సహాయకులు, హోటల్‌ సిబ్బంది ఫోన్లన్నీ తీసేసుకున్నారు. అయితే, యడ్యూరప్ప సీఎం పదవి చేపట్టాక రిసార్టు బయట పోలీసు సిబ్బందిని తొలగించేశారు. జేడీఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలను వసంత్‌ నగర్‌‌లోని సెవెన్‌ స్టార్‌ హోటల్‌ షాంగ్రి-లాలో ఉంచారు. తమ పార్టీలో ఎవరూ ఫిరాయించేవాళ్లు లేరని కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, గడువు సుదీర్ఘంగా ఉండటంతో బెంగళూరులో ఎమ్మెల్యేలను ఉంచడం మంచిది కాదని ఇరు పార్టీల పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించగా, ఇంకా జేడీఎస్‌ ఎటు వెళ్లాలనేది నిర్ణయించుకోలేదు. అంతకుముందు, కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలు ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జేడీఎస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ కు తరలించనున్నట్లు కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.