Widgets Magazine

కర్ణాటకపై బాబు, స్టాలిన్ ఫైర్... రాజ్‌భవన్ ముందే స్నానపానాదులు చేసివుంటే?

గురువారం, 17 మే 2018 (14:35 IST)

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. 
chandrababu
 
ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పదే పదే తప్పులు చేస్తుందని.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరుబాటను ఎంచుకోలేదని, రాజ్ భవన్ ముందు బైఠాయించి, అక్కడే స్నానపానాదులు కానిస్తూ దేశమంతా చర్చ జరిగేలా జాతీయ మీడియాను ఆకర్షించివుంటే బాగుండేదని బాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్ సైతం కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచివుంటే బాగుండేదని అన్నారు. కర్ణాటక ఫలితాలను సమీక్షిస్తే, తెలుగువారి ఓట్లు బీజేపీకి రాలేదని తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు కర్ణాటక వ్యవహారంపై డీఎంకే ముఖ్యనేత ఎంకే స్టాలిన్ కూడా మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని స్టాలిన్ తెలిపారు.
 
సభలో మెజారిటీ లేకపోయినా, అవినీతి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తు చేశారు. అయితే వీటినన్నింటినీ ప్రజలు గమనిస్తూనే వున్నారని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు, విలువలు ప్రమాదంలో పడ్డాయని స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హోం మంత్రి చెప్పులకు సెక్యూరిటీ... ఎక్కడ? ఏమిటి?

సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు రక్షణగా భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డు)ని ...

news

ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేక పోయారు.. ఇక 8 మందిని ఎలా ఆకర్షిస్తారు : జవదేకర్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్రమంత్రి, కర్ణాటక రాష్ట్ర ...

news

మావోయిస్టు కీలక నేత ఆర్కేను చుట్టుముట్టారా? భారీ ఎన్‌కౌంటర్?

మావోయిస్టు కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు ...

news

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. బోరున విలపించిన సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం ...

Widgets Magazine