గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:08 IST)

కావేరీ జలాలపై ఏ ఒక్కరికీ హక్కు లేదు : సుప్రీంకోర్టు

కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది.

కొన్ని దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన కావేరీ జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. అదేసమయంలో ఆయా రాష్ట్రాలకు కేటాయించాల్సిన నీటిపై కూడా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్చు చీఫ్‌ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ 10.30 గంటల ప్రాంతంలో తీర్పును వెలువరించింది. 
 
జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) 2007లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ అనంతరం బెంచ్ తీర్పునిచ్చింది. గత 8 నెలల్లో 28 రోజుల పాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును 2017 సెప్టెంబర్ 20న రిజర్వ్ చేసింది. నెలలోగా తీర్పును వెలువరిస్తామని గత జనవరిలో సుప్రీంకోర్టు ప్రకటించింది.
 
కాగా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా కావేరి జలాల వివాదం నలుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటక రాష్ట్రానికి 184.75 టీఎంసీల నీటిని కేటాయించాలని, కేరళ (17 టీఎంసీలు), పుదుచ్చేరి (7 టీెఎంసీలు) రాష్ట్రాలకు యధావిధిగానే కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది.