Widgets Magazine

బాలికపై అత్యాచారం.. శుద్ధీకరణ పేరుతో అరగుండు (వీడియో)

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:00 IST)

victim woman

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన బాధితురాలికి శుద్ధీకరణ పేరుతో అరగుండు గీయించి.. గ్రామ బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని కవర్ధా జిల్లాలో ఓ 13 యేళ్ళ వయసున్న బాలికపై అర్జున్ యాదవ్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. దీంతో బాధితురాలిని పంచాయితీకి పిలిపించి... శుద్ధీక‌ర‌ణ పేరుతో పంచాయ‌తీ పెద్దలు అర‌గుండు గీయించారు. 
 
అంతేనా, ఆ బాలికతో ఎవ్వరూ మాట్లాడవద్దని, ఆమె గ్రామ ప్రజలకు దూరంగా ఉండాలని బహిష్కరించారు. కానీ, ఆమెపై అత్యాచారం చేసిన అర్జున్ యాదవ్‌కు మాత్రం ఎలాంటి శిక్ష విధించకపోగా, గ్రామంలో స్వేచ్ఛగా తిరిగేలా తీర్పునిచ్చారు. 
 
ఈ విషయం జిల్లా పోలీసులకు తెలియడంత నిందితుడు అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను బహిష్కరించని పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్ సర్జికల్ దాడులకు సై.. పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు...

జమ్మూకాశ్మీర్‌లోని సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై లష్కర్ తోయిబా తీవ్రవాదులు దాడికి పాల్పడగా, ...

news

కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ నగర జైళ్లు.. ఎందుకు?

హైదరాబాద్ మహానగరంలోని జైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఈ జైళ్ళకు వస్తున్న వారంతా తీవ్రమైన ...

news

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ ...

news

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు : వదినను హత్య చేసి రంపంతో ముక్కలు చేశాడు

గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి హైదరాబాద్ కొండపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద ...

Widgets Magazine