శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఫోటో పిచ్చి... పరువు పోగొట్టుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే (వీడియో)

ఫోటో పిచ్చితో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఒకరు తమ పరువు పోగొట్టుకున్నారు. పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న తాపత్రయంతో తమకు తాముగానే పరువు తీసుకున్నారు.

ఫోటో పిచ్చితో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఒకరు తమ పరువు పోగొట్టుకున్నారు. పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న తాపత్రయంతో తమకు తాముగానే పరువు తీసుకున్నారు. ప్రజా ప్రతినిధులై ఉండి వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీ మహిళా ఎంపీ రేఖా వర్మ, మరో మహిళా ఎమ్మెల్యే కలిసి తమ తమ మద్దతుదారులతో పేదలకు దుప్పట్లు పంచేందుకు సీతాపూర్ ప్రాంతానికి వెళ్లారు. పేదలకు దుప్పట్లు అందించే వేళ, తాను ఫోటోలు దిగుతానంటే, తాను ఫోటోలు దిగాలంటూ ఇద్దరూ గొడవపడ్డారు.
 
చుట్టూ ప్రజలున్నారన్న సంగతిని మరచిపోయారు. మీడియా ఉందన్న విషయమూ వారికి గుర్తుకు రాలేదు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే మద్దతుదారుడిని ఎంపీ కొట్టగా, ఎంపీ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. వీరి గొడవ గురించి తెలుసుకున్న కలెక్టర్, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి సర్ది చెప్పి అందరినీ పంపించారు. వీరిద్దరి గొడవ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.