Widgets Magazine

రోజా తీరు బాగుండటంలేదు.. కోట శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో తీవ్రస్థాయిలో తిట్లు తింటున్న రోజాకు సినీనటుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రోజా తీరుపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. రోజా మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా బాధగా ఉంది. ఆమె సినీ పరిశ్రమలోకి వచ

Kota
TJ| Last Modified మంగళవారం, 9 జనవరి 2018 (13:40 IST)
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో తీవ్రస్థాయిలో తిట్లు తింటున్న రోజాకు సినీనటుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రోజా తీరుపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. రోజా మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా బాధగా ఉంది. ఆమె సినీ పరిశ్రమలోకి వచ్చే సమయంలో అందరితో మర్యాదగా మాట్లాడేది. అందరిని కలుపుకుని వెళ్ళేది. రోజా అంటే అప్పట్లో మాకందరికీ గౌరవమే. రోజా మంచి నటి కూడా. అయితే ఈ మధ్య రోజా తీరు బాగాలేదు.
గత కొన్నిరోజులకు ముందు నిర్మాత బండ్ల గణేష్‌తో రోజా మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధేసింది. అదొక్కటే కాదు రోజా మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా వల్గర్‌గా మాట్లాడుతున్నారు. నాకెందుకో ఆమెను చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. రోజా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది అన్నారు కోట శ్రీనివాసులు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు రోజా కౌంటర్ ఇవ్వలేదు.


దీనిపై మరింత చదవండి :