Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:01 IST)

Widgets Magazine

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులను చంపేయాలని.. వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివల్ కోరారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు సత్యాగ్రహం చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఎనిమిది నెలల చిన్నారిపై ఢిల్లీలో జరిగిన అకృత్యం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసిన స్వాతి..చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని.. అలాంటి విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
 
కామాంధుడి అఘాయిత్యానికి గురైన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని.. ప్రధాని దృష్టి అటు వైపు మళ్లించేందుకే ఈ లేఖను రాసినట్లు స్వాతి పేర్కొన్నారు. ఇంతకుముందు రెండేళ్లుగా ప్రధాని మోదీకి రాసిన లేఖల్లో ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. మహిళలు అందరికీ మీరే దిక్కు.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మోదీపై వుందని లేఖలో స్వాతి పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌కు షాక్.. టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ ...

news

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ...

news

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ...

news

ప్రజలు మాకు తలాక్ చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్ : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బద్ధశత్రువుగా ఉన్న బీజేపీ ఎంపీల్లో సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ...

Widgets Magazine