Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రజలు మాకు తలాక్ చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్ : బీజేపీ ఎంపీ

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (15:58 IST)

Widgets Magazine
Shatrughan Sinha

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బద్ధశత్రువుగా ఉన్న బీజేపీ ఎంపీల్లో సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ఒకరు. ఈయన మోడీని విమర్శించేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోరు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో అధికార బీజేపీకి ఎదురైన ఓటమిని ప్రధానాంశంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని భావిస్తున్న బీజేపీకి ప్రజలే ట్రిపుల్ తలాక్ చెప్పే రోజులు సమీపిస్తున్నాయని జోస్యం చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్, అల్వార్, మంగల్‌గఢ్ సీట్లలో బీజేపీ ఘోర ఓటమి చవిచూపిందని, పార్టీ ట్రిపుల్ తలాక్ ఇచ్చిన తొలిరాష్ట్రంగా రాజస్థాన్ నిలిచిందంటూ ఓ ట్వీట్‌లో ఆయన ఎద్దేవా చేశారు. 
 
'బ్రేకింగ్ న్యూస్... అధికార పార్టీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దారుణమైన ఓటమిని చవిచూసింది. బీజేపీకి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన తొలి రాష్టంగా రాజస్థాన్ నిలిచింది. అజ్మీర్: తలాక్, ఆల్వార్: తలాక్, మండల్‌గఢ్: తలాక్. మా ప్రత్యర్థులు రికార్డు స్థాయి ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలుపొంది, బీజేపీని ఓ కుదుపు కుదిపేశారు' అని ఆ ట్వీట్‌లో శత్రుఘ్నిసిన్హా పేర్కొన్నారు. 
 
'ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తక్షణ నష్ట నివారణ చర్యలను పార్టీ తీసుకోవాలి. లేనిపక్షంలో పార్టీ పతనం కొనసాగుతుంది. టాటా-బైబై ఫలితాలే మునుముందు చవిచూడాల్సి వస్తుంది. బీజేపీ మేలుకో. జైహింద్' అంటూ శత్రుఘ్నసిన్హా ఘాటైన ట్వీట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జైట్లీ బడ్జెట్‌ సెగలు : బీజేపీ ఎంపీలకు ఓటమి భయం

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల్లోనే కాకుండా ...

news

ఉ.కొరియాకు పెనుముప్పు పొంచివుంది.. ఆ దేశాలను వదలం: అమెరికా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య త్వరలో యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ మీడియా ...

news

నాతో నిశ్చితార్థం చేసుకుని వేరొకడితో సన్నిహితంగా వుంటోంది.... అందుకే చంపేశా

హయత్ నగర్‌లో యువతి దారుణ హత్య కేసులో కాబోయే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలడంతో అతడిని ...

news

అనంతలో ప్రత్యేక హోదా ఉద్యమం : రోడ్డుపైనే విద్యార్థుల వంటా-వార్పు.. వైకాపా మద్దతు

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ...

Widgets Magazine