భారతీయ రైలులో విమాన సౌకర్యాలు...

శుక్రవారం, 12 జనవరి 2018 (12:30 IST)

Shatabdi Express

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో విమానంలో ఉండే సౌకర్యాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. అంతేనా ఈ తరహా సౌకర్యాలను తొలిసారి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రవేశపెట్టారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ - మైసూరు ప్రాంతాల మధ్య నడుస్తోంది. 
 
ఈ రైలులో ప్రతి సీటుకు ఇన్ఫోటెయిన్‌మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలను కల్పించారు. అలాగే, టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్‌తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. 
 
ప్రత్యేకంగా రూ.3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్‌ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీ (ఇటెంగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ఐసీఎఫ్)లో నిర్మించారు. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు. ఈ సౌకర్యాలతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. దీనిపై మరింత చదవండి :  
Chennai Mysore Shatabdi Express Flight Facilities

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. సమస్యల ఏకరవు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ...

news

చిన్నారి శాన్వి హంతకుడు రఘుకు 23న ఉరి.. అమెరికా కోర్టు

పది నెలల చిన్నారి శాన్విని, ఆమె నాన్నమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన యండమూరి ...

news

'కమలం'కు టాటా... 'హస్తం' గుర్తుకు జై అంటున్న నాగం జనార్థన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఆ రాష్ట్రంలో ...

news

ఇస్రోకు "వంద"నం.. విఫలం తర్వాత విజయం (వీడియో)

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. తనతో పాటు తీసుకెళ్లిన ...