Widgets Magazine

సుప్రీం కోర్టు జడ్జీల తిరుగుబాటు.. దేశ చరిత్రలో ప్రప్రథమం

శుక్రవారం, 12 జనవరి 2018 (13:40 IST)

suprme court judges

భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ దేశంలో జరగని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, రంజన్, మదన్ లోకూర్, రంజన్ గొగోయ్‌లు నిరసన వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై తిరుగుబాటు చేశారు. ఢిల్లీలోని జస్టిస్ చలమేశ్వర్ ఇంట్లో నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా  సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టు కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా సాగడం లేదని ఆరోపించారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేఖ రాసినా పట్టించుకోలేదనీ, అందువల్ల విధిలేని పరిస్థితుల్లో దేశ చరిత్రలోనే తొలిసారి మీడియా ముందుకు వచ్చినట్టు ప్రకటించారు. 
 
జడ్జీల మాటలు ఇలా ఉన్నాయి :
సుప్రీంకోర్టులో కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయి. పరిపాలన వ్యవహారాలు సరైన పద్దతిలో జరగటం లేదు. వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. నాలుగు నెలలు క్రితం కొలీజియంలోని నలుగురు జడ్జీల సంతకాలతో లేఖ రాశాం. అయినా పరిపాలన వ్యవస్థలో మార్పు లేదు. మా ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నాం. మీడియా ముందుకు వచ్చాం. మా ఆవేదనను బహిరంగంగా వెల్లడించాలని నిర్ణయించుకున్నాం. సుప్రీంకోర్టులో పరిపాలన, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు.
 
సుప్రీంకోర్టులో పరిపాలన సరిగా లేదు. అది మాపై ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్‌లో ఈ జడ్జీలు ఎందుకిలా చేశారు.. ఈ వ్యవస్థ ఎందుకిలా తయారు అయ్యింది అని ఎవరూ అనుకోకూడదు. కేసుల విషయంలో ఈ తీర్పులు ఏంటీ అని దేశ ప్రజలు అనుకోకూడదు. ఓ కేసు విషయంపై మేం.. మా అభిప్రాయాలను లేఖ రూపంలో చీఫ్ జస్టిస్‌కు తెలియజేశాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక.. సమస్య ఇక పరిష్కారం కాదేమో అని భయపడి.. విధిలేని పరిస్థితుల్లో.. దేశ ప్రజలకే వాస్తవాలను వివరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారతీయ రైలులో విమాన సౌకర్యాలు...

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో ఓ శుభవార్త తెలిపింది. శతాబ్ది, దురంతో ...

news

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. సమస్యల ఏకరవు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ...

news

చిన్నారి శాన్వి హంతకుడు రఘుకు 23న ఉరి.. అమెరికా కోర్టు

పది నెలల చిన్నారి శాన్విని, ఆమె నాన్నమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన యండమూరి ...

news

'కమలం'కు టాటా... 'హస్తం' గుర్తుకు జై అంటున్న నాగం జనార్థన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఆ రాష్ట్రంలో ...

Widgets Magazine