Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పకోడీ తయారీ మంచి పనే.. యువత రెస్టారెంట్లు పెట్టేస్తారు: ఆనందీ బెన్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (13:26 IST)

Widgets Magazine

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ సమర్థించే పనిలో పడ్డారు. పకోడీలు తయారు చేసే వ్యక్తి రోజుకు రూ.200 వరకు సంపాదిస్తుండటాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఇందులో తప్పేమీ లేదని ఆనందీ బెన్ అన్నారు. పకోడీల తయారీ ఓ నైపుణ్యం అని., భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపారాల ప్రారంభానికి అది తొలిమెట్టు అంటూ చెప్పుకొచ్చారు. 
 
పకోడీలు తయారు చేసి అమ్మేవారు రెండేళ్ల తర్వాత హోటల్‌కు సప్లై చేసేవారుగా ఎదుగుతారు. ఆపై సొంతంగా రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించే స్థాయికి ఎదిగిపోతారని ఆనందీ బెన్ తెలిపారు. పకోడీ తయారీ ఓ మంచి పనికాదని భావించవద్దునని.. మంచి పకోడా లేదా రుచికరమైన పకోడా చేయకపోతే కస్టమర్లు రారని మోదీ పకోడా వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చారు.
 
అయితే ప్రధాని పకోడీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సోషల్ మీడియా వేదికగా పకోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పకోడా విక్రేతల తర్వాత ప్రభుత్వం బిచ్చగాళ్లను కూడా ఉద్యోగులుగానే పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం వుండదంటూ ఫైర్ అయ్యారు. అయితే పకోడా విక్రేతలను బిచ్చగాళ్లతో పోల్చడం సరికాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన ...

news

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో ...

news

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను ...

news

వాణీ విశ్వనాథ్‌కి బిస్కెట్ - రోజాకు జిలేబీ... ఏంటిది..?

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ...

Widgets Magazine