బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (13:03 IST)

వెన్నుకు బుల్లెట్ తగిలినా బిడ్డకు జన్మనిచ్చిన జవాను భార్య

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి వెన్నెముకకు బుల్లెట్ గాయం తగిలినప్పటికీ ఆమె ప్రసవించిన బిడ్డకు మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముష్కర మూకల కాల్పుల్లో రైఫిల్‌ మ్యాన్ నజీర్‌ అహ్మద్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో జమ్మూలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేశారు. 
 
ఆ తర్వాత అంటే ఆదివారం రాత్రి సిజేరియన్ తర్వాత ఆడశిశువుకు జన్మిచ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆర్మీ డాక్టర్లు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితురాలి వెన్నెముకకు బుల్లెట్ తగిలింది. అయితే ఆమె కడుపులో ఉన్న పాపకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం.