పరీక్షల ఒత్తిడి.. బిల్డింగ్ ఎక్కి ఉరేసుకున్న విద్యార్థిని.. ఫెయిలయిపోతానని?
పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట గోడకు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థినులు షాక్ అయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట గోడకు వేలాడుతూ కనిపించడంతో తోటి విద్యార్థినులు షాక్ అయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి మార్వాడీ కాలేజీలో బి.ఏ.పార్ట్ టూలో ఇంగ్లీష్ హానర్స్ చదువుతూ ఉంది. ఆర్జీ స్ట్రీట్‌లో వినాయకమ్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది.
అయితే పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు రాసిన సూసైడ్ లేఖలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్ ను ఆమె స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఆ యువతి పరీక్షల ఒత్తిడి వలన ఎంతగానో ఇబ్బంది పడుతోంది. గతంలో ఫెయిల్ కూడా అయ్యిందని.. ఇంట్లో వారు తిట్టడం.. హాస్టల్‌లో వుంటూ చదువుతున్నా పరీక్షల్లో రాణించలేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయాన్ని మృతురాలు ఆమె చెల్లెలితోనూ చెప్పిందంటున్నారు. ఆమె గదిలో ఆమెతో పాటు మరో ముగ్గురు ఉండడంతో గదిలో ఉరివేసుకోడానికి కుదరలేదు. దీంతో బిల్డింగ్ ఎక్కి.. అక్కడ ఉరివేసుకుంది. తనను క్షమించాలని తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.