Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత... అపస్మారక స్థితిలో కంచి స్వామి

సోమవారం, 15 జనవరి 2018 (09:16 IST)

Widgets Magazine
Jayendra Saraswathi

కంచి కామకోటి పీఠాధిపతి, శంకరాచార్య జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో ఆయనను హుటాహుటిన చెన్నై పోరూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆదివారం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన బ్లడ్ షుగర్ పడిపోవడం, శ్వాస తీసుకోలేక పోతుండటంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఆయన్ను స్పృహలేని స్థితిలో ఆసుపత్రికి తీసుకు వచ్చారని, వెంటిలేటర్ ఆధారంగా శ్వాసను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
 
కాగా, మార్చి 22, 1954న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తన వారసుడిగా జయేంద్రను పీఠాధిపతిగా ప్రకటించారు. తదనంతర కంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. 2016 ఆగస్టులో విజయవాడలో పర్యటిస్తున్న వేళ, ఆయన ఆరోగ్యం మందగించడంతో ఆసుపత్రిలో చికిత్సను అందించిన విషయం తెల్సిందే. కాగా, క్రీస్తు పూర్వం 482లో శ్రీ ఆది శంకర స్థాపించిన కంచి కామకోఠి పీఠానికి, ఇప్పటివరకూ 69 మంది ఆచార్యలు సేవలందించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాపం టీఎన్.శేషన్ దంపతులు.. పిల్లలు లేకపోవడంతో....

దేశ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన ...

news

భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. మోడీ స్వాగతం

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం ...

news

భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం : పాకిస్థాన్

తమ పాలకులు అనుమతిస్త భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ...

news

అగ్ని-5 పరీక్షకు సిద్ధమైన భారత్.. పాకిస్థాన్‍కు ముచ్చెమటలు

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో ...

Widgets Magazine