1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:44 IST)

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం కంచిలోని ఆస్పత్రిలో చేరాక, ఆయన బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశార

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం కంచిలోని ఆస్పత్రిలో చేరాక, ఆయన బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశారు. 1935 సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించిన జయేంద్ర సరస్వతి కంచి మఠానికి 69వ పీఠాధిపతి. ఆయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. 
 
నిజానికి జయేంద్ర సరస్వతి గతంలో విజయవాడలో పర్యటించిన సమయంలో కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత గుంటూరులోని ఎన్.ఆర్.ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. మళ్లీ ఆస్పత్రిలో ఆయన చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన కంచి మఠానికే పరిమితమయ్యారు. 
 
అదేసమయంలో ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధవడుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి ఆయనను కంచిలోని ఓ ఆస్పత్రికి తరలించగా, బుధవారం కన్నుమూశారు.