శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (08:50 IST)

దుబాయ్‌లోనే శ్రీదేవి భౌతికకాయం.. ఎందుకంటే...

హఠాన్మరణం చెందిన అందాల నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకునిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆదివారం కావడంతో పాటు.. దౌత్యపరమైన అనుమతులు మంజూరు కాలేదు. దీంతో సోమవారం సాయంత్రానికి శ్రీదేవి మృత

హఠాన్మరణం చెందిన అందాల నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకునిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆదివారం కావడంతో పాటు.. దౌత్యపరమైన అనుమతులు మంజూరు కాలేదు. దీంతో సోమవారం సాయంత్రానికి శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకు తీసుకుని రావొచ్చు. ఇందుకోసం అంబానీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం దుబాయ్‌లో సిద్ధంగా ఉంది. 
 
శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో కన్నుమూసిన శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వైద్యులు జాప్యం చేశారు. పైగా, ఆదివారం కావడంతో  దౌత్యపరమైన అనుమతులు పూర్తికాలేదు. దీంతో సోమవారం ఉదయం 12 గంటల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ వచ్చాకే ఎంబాల్మింగ్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి.
 
ఎంబాల్మింగ్ చేసేందుకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఎంబాల్మింగ్ తర్వాతే డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్ వచ్చాకే ఇండియన్ కాన్సులెట్‌లో పాస్‌పోర్టు రద్దు చర్యలు చేపడతారు. డెడ్ బాడీని తరలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి తప్పనిసరి. దీంతో శ్రీదేవీ డెడ్ బాడీ ముంబైకి చేరేసరికి సాయంత్రం దాటే అవకాశం ఉంది.
 
అంతేకాకుండా, గత 24 గంటల నుంచి శ్రీదేవి డెడ్‌బాడీ ఆస్పత్రిలోనే ఉంది. మరోవైపు శ్రీదేవి డెడ్ బాడీని ముంబైకి తీసుకువచ్చేందుకు 11 సీట్ల ప్రైవేట్ జెట్ విమానాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ దుబాయ్‌కు పంపించారు. శ్రీదేవి భౌతికకాయాన్ని సోమవారం సాయంత్రానికి ముంబైకు తీసుకొచ్చి ఆ తర్వాత సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.