వివాహాలకు వెళ్తే.. ఇలా కూడా జరుగుతుందండోయ్.. మహిళలూ జాగ్రత్త...
ఏదో శుభకార్యం జరుగుతుందని వెళ్తే.. అక్కడే అసలు వేధింపులు మొదలయ్యాయి. ఇదెక్కడి చోద్యమండి అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. కేరళలో ఓ ఫోటో స్టూడియో నీచానికి దిగజారింది. అనేక వివాహాలకు హాజరయ్యే ఈ ఫోటో స్ట
ఏదో శుభకార్యం జరుగుతుందని వెళ్తే.. అక్కడే అసలు వేధింపులు మొదలయ్యాయి. ఇదెక్కడి చోద్యమండి అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. కేరళలో ఓ ఫోటో స్టూడియో నీచానికి దిగజారింది. అనేక వివాహాలకు హాజరయ్యే ఈ ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్లు మహిళలను లైంగిక వేధింపుల బాధితులుగా మార్చేశారు.
కోజికోడ్ జిల్లాలోని వడకర పట్టణంలోని సదయమ్ స్టూడియోను సతీశన్, దినేశ్, బిటేశ్ నిర్వహిస్తున్నారు. వీరు శుభకార్యాలకు హాజరై.. పలువురు మహిళల ఫోటోలను అందంగా చిత్రీకరించేవారు. వివాహానంతరం వారి ఫోటోలను వారికి అందజేసి.. తర్వాత అసలు పని మొదలెట్టేవారు. మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేవారు. అయితే వీరి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది.
తన ఫోటోను గుర్తుపట్టి పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీశన్, దినేశ్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బిటేశ్ కోసం గాలింపు చేపట్టారు. వీరి ఫోటో స్టూడియోను సీజ్ చేశారు. వీరి స్టూడియో హార్డ్ డిస్క్‌లో సుమారు 40 వేల మంది మహిళల ఫొటోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.