Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భోజనం చేసే ప్లేట్లతో టాయిలెట్ క్లీన్ చేయిస్తారా?

శనివారం, 11 నవంబరు 2017 (10:00 IST)

Widgets Magazine
meals

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు తినేందుకు ఉపయోదించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు విద్యార్థులు టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. 
 
దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు... టాయిలెట్‌‌లోని వ్యర్థాలను తినే ప్లేట్లతో ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్లు పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులంతా పాఠశాలలో ఆందోళన చేపట్టారు. 
 
కానీ తల్లిదండ్రుల ఆరోపణలను పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని చెప్పారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ శ్రీవారి దర్శనంపై పాస్టర్ల ఫైర్.. వైఎస్సార్ కూడా విగ్రహారాధన చేయడంతోనే?

క్రైస్తవుడైన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పూజించడంపై కొందరు ...

news

మంత్రి నారాయణను అవమానించిన టిడిపి నేతలు.. ఎందుకు?

పురపాలక అర్బన్ హౌసింగ్ మంత్రి నారాయణకు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా ఇన్‌చార్జీ ...

news

జగన్‌లో ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి... ఏపీ ఆర్థిక మంత్రి

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు ఎపి ఆర్థిక శాఖామంత్రి యనమల ...

news

అడ్డదారిలో మంత్రి అయిన పప్పబ్బాయ్... : రోజా ఫైర్

వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా మరోమారు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ...

Widgets Magazine