ఫోటో చూస్తే అమ్మాయి నచ్చలేదు.. ఉరేసుకున్న యువకుడు

బుధవారం, 22 నవంబరు 2017 (09:05 IST)

suicide

అమ్మాయి నచ్చలేదని చెప్పినా వినిపించుకోకుండా.. అదే అమ్మాయితో వివాహం చేయించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలిసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ వర్తూరు సమీపంలోని ముళ్లూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అజయ్ (23) అనే యువ‌కుడు ఉపాధి కోసం వర్తూరు సమీపంలోని ముళ్లూరులో నివ‌సిస్తున్నాడు. ఆ యువ‌కుడికి పెళ్లి చేయాల‌ని భావించిన తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి, పెళ్లి కూతురి ఫొటోను పంపారు. 
 
కానీ ఫోటోను చూసిన వెంటనే అజయ్ అమ్మాయి నచ్చలేదని చెప్పేశాడు. అయిన‌ప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. తీవ్ర ఒత్తిడికి గురైన ముళ్లూరు గ్రామ సమీపంలోని నీలగిరి తోటలో చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Crime News Madhya Pradesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్య, కుమారుడిని పక్కనబెట్టి... దొంగలను హతమార్చిన సైనికుడు

హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సైనికుడు తన భార్య వద్ద కుమారుడిని అప్పగించి ...

news

ఆస్తి కోసం అన్న భార్యపై 9 నెలలుగా అత్యాచారం...

అన్న భార్య అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో సమానమైన స్త్రీపై 9 నెలలుగా ...

news

మంత్రి లోకేష్ చక్కగా మాట్లాడుతున్నారు... ప్రభుత్వ విప్ యామినీ బాల

అమరావతి: శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు హాజరు కాకపోయినా నియోజకవర్గం వారీగా అభివృద్ధి ...

news

డెంగ్యూతో బాలిక మృతి- బిల్లు మాత్రం రూ.18లక్షలు

డెంగ్యూ ఆస్పత్రిలో చేరిన బాలిక మృతి చెందింది. అయితే బిల్లు మాత్రం రూ.18లక్షలు పడింది. ...