ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 15మంది సజీవదహనం
ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు వున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతి కావడంతో 12 మంది తీవ్రగా
ముంబై నగరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 12మంది మహిళలు వున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతి కావడంతో 12 మంది తీవ్రగాయాల పాలైనారు.
క్షతగాత్రులను సహాయక సిబ్బందికి ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి 12.27 గంటలకు ప్రమాద స్థలం నుంచి తమకు తొలి ఫోన్ కాల్ వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే 8 శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు మాట్లాడుతూ, రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయన్నారు. ఆ మంటలు సమీపంలో వున్న డిన్నర్ కమ్ పబ్‌లకు వ్యాపించాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.