Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరిచిపోలేని రోజు.. 6న బాధ్యతలు స్వీకరిస్తా : నిర్మలా సీతారామన్

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (17:51 IST)

Widgets Magazine
Nirmala Sitharaman

తన జీవితంలో సెప్టెంబర్ మూడో తేదీ మరచిపోలేని రోజని కేంద్ర రక్షణ మంత్రిగా కొత్తగా నియమితులైన నిర్మాలా సీతారామన్ అన్నారు. తనకు అప్పగించిన రక్షణ శాఖ మంత్రి పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, ఈనెల 6వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. 
 
సహాయ మంత్రిగా ఉన్న ఆమె... పదోన్నతి పొంది ఆదివారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. 
 
ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైనదని, తన స్పందనను మాటల్లో చెప్పలేనన్నారు. తన నుంచి ఆశించిన లక్ష్యాలను చేరుకొనేందుకు కృషిచేస్తానన్నారు. దేశంలో ఇదివరకు రక్షణ మంత్రులుగా పనిచేసినవారంతా వారి వారి పాత్రలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మహిళలు బృందంగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. 
 
కాగా, నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖను కేటాయించిన ప్రధాని మోడీ... పియూష్ గోయెల్‌కు రైల్వే, బొగ్గు శాఖలను కేటాయించారు. అలాగే, ధర్మేంద్ర ప్రదాన్‌కు పెట్రోలియం, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి మైనార్టీ సంక్షేమం, ఆర్‌.కె.సింగ్‌‌కు విద్యుత్‌ (స్వతంత్ర హోదా), ఆల్ఫోన్స్‌ కన్నన్‌ థానమ్‌కు పర్యాటక (స్వతంత్ర హోదా), ఐటీ శాఖ సహాయ మంత్రి, హర్‌దీప్‌ సింగ్‌‌కు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి (స్వతంత్ర హోదా), సత్యపాల్ సింగ్‌కు‌ మానవవనరుల అభివృద్ధి, జలవనరులు, గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వ్యవసాయం, రైతు సంక్షేమం, అశ్విని కుమార్‌ చౌబేకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, అనంతకుమార్‌ హెగ్డేకు నైపుణ్యాభివృద్ధి శాఖ, శివ ప్రతాప్‌ శుక్లాకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి, వీరేంద్రకుమార్‌‌కు మహిళా, శిశు సంక్షేమం, స్మృతి ఇరానీకి సమాచార, జౌళి శాఖ, సురేశ్‌ ప్రభుకు వాణిజ్య శాఖను కేటాయించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉత్తర ప్రదేశ్‌కు పెద్దపీట.... బీహార్‌లో బీజేపీ ఎంపీలకే ఛాన్స్

తాజాగా చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

news

నాడు ఇందిరా గాంధీ.. నేడు నిర్మలా సీతారామన్...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ...

news

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు... ఎక్కడ?

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదీ కూడా ఆసియాలోనే అతిపెద్ద ...

news

తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు ...

Widgets Magazine