Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

మంగళవారం, 9 జనవరి 2018 (09:40 IST)

Widgets Magazine
mahatma gandhi

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించారు. 
 
జాతిపిత హత్య కేసును జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. మహాత్మా గాంధీ హత్యలో ఓ విదేశీ సంస్థ హస్తం ఉందని, ఈ కేసును తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన అమికస్ క్యూరీగా అమరేంద్ర శరణ్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 
 
కానీ కేసు పునర్విచారణ అవసరం లేదని శరణ్ తన నివేదికలో స్పష్టంచేశారు. విదేశీ సంస్థ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. గాంధీ శరీరంలోకి దిగిన బుల్లెట్లు, ఏ పిస్తోలు నుంచి వాటిని ఫైర్ చేశారు.. ఎవరు కాల్చారు.. దాని వెనుక కుట్ర.. ఇలా అన్నింటినీ స్పష్టంగా గుర్తించారు.
 
గాడ్సే కాకుండా మరో అజ్ఞాత వ్యక్తి గాంధీ హత్యలో పాలుపంచుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. గాంధీ శరీరంలో దిగిన నాలుగో బుల్లెట్ ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్చిందని, దానివల్లే ఆయన మరణించారన్న పిటిషనర్ వాదనను కూడా శరణ్ తోసిపుచ్చారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హఫీజ్ క్యాలెండర్‌: పాక్ పత్రికలు కూడా కొమ్ముకాస్తున్నాయా?

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలతో కూడిన ...

news

మొగున్నే కడతేర్చిన నర్సవ్వ ... తెలంగాణాలో మరో వివాహేతర హత్య

తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ ...

news

భర్త వద్దు... ప్రియుడే ముద్దు : భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య నాటకం

ఇటీవలి కాలంలో ప్రియుళ్ళ మోజులో పడిన భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతోంది. ...

news

రోడ్ రోగ్స్... 19 ఏళ్ల యువతిని చంపేశారు... ఆమె అవయవాలు ఇద్దామన్నా...

రోడ్ రోగ్స్... ఈమాట మనలో చాలామందికి తెలుసు. రోడ్డుపైన అంతా చక్కగా వెళుతున్నప్పుడు ...

Widgets Magazine