Widgets Magazine

'బ్లూవేల్‌ ఛాలెంజ్' : బ్లేడుతో నాలుక కోసుకున్నాడు...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:39 IST)

blue whale game

సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్. అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా భారత్‌లోనూ పంజా విసురుతోంది. 
 
10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట చిన్నారులను హిప్నటైజ్‌ చేస్తుంది. భావోద్వేగాలతో పిల్లలను మృత్యుఒడిలోకి తోసేస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో ఇప్పటికే వందలాది మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న ఈ ఆట.. ఇప్పుడు భారత్‌లో పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ ప్రమాదకరమైన గేమ్‌ నుంచి రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
తాజాగా, ప్రాణాంతక ఆన్‌లైన్‌ క్రీడ ‘బ్లూవేల్‌’ బారిన పడి చెన్నైకు చెందిన ఓ యువకుడు చేతులు, నాలుకను కోసుకున్నా డు. చెన్నై నగర శివారు ప్రాంతమైన పల్లావరం సమీపంలోని పోళిచ్చళూరు ఆండాల్‌నగర్‌లో ఒడిషాకు చెందిన యువకుడు ప్రసాద్‌(21) వారంరోజులుగా సెల్‌ఫోన్‌తోనే కాలం గడుపుతూ, ముభావంగా కనిపించాడు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ బ్లేడుతో చేతులు, నాలుకను కోసుకుని అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏడేళ్ళ బాలికను రేప్ చేసి చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లాలో కొందరు కామాంధులు పసిమొగ్గపై తమ రాక్షసత్వం ...

news

అమ్మాయిలపై లైంగిక దాడులు... ఈ చెప్పుతో కొడితే..?

అమ్మాయిలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్న తరుణంలో అత్యాచారాలు, లైంగిక దాడుల నుంచి ...

news

కాంగ్రెస్ దళపతిగా రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకానున్నారు. ఆ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ...

news

రోజూ ఓ గంట క్రీడలకు కేటాయించండి... మంత్రి కొల్లు

అమరావతి : ప్రతిరోజూ ఓ గంట క్రీడలకు కేటాయిస్తే, అందరూ ఆరోగ్యంగా ఉంటారని యువజన, క్రీడల శాఖ ...