Widgets Magazine

కిడ్నాప్ అయిన బాలికపై పోలీసు అత్యాచారం-హత్య: వారం రోజులు బంధించి?

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (09:46 IST)

కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన బాలికను వెతికేందుకు వెళ్లిన పోలీసు వారం రోజుల పాటు బాలికను బంధించిన అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ-కాశ్మీర్‌, కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల జనవరి 10వ తేదీన గుర్రాపు మేపుతుండగా అపహరణకు గురైంది. 
 
తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారే బాలిక పట్ల యముడిగా మారాడు. ఈ మేరకు బాలికను గుర్తించిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీపక్ ఖుజారియా (28) ఆమెను వెంటనే తల్లిదండ్రులకు అప్పగించలేదు. వారం రోజుల పాటు బంధించాడు.
 
మరో బాలుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను దారుణంగా హత్యచేసి పొలాల్లో పడేశారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం పోలీసులు చేధించారు. ఈ ఘటనలో దీపక్ హస్తం వుందని అతనని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ ...

news

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ...

news

చౌదరి రాజీనామా చేసెయ్... రెడీ సర్.. మరో రెండురోజుల్లో...?

ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి ...

news

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ...

Widgets Magazine